Breaking

Monday, 5 June 2023

Aradhana nike aradhana song lyrics | ఆరాధనా నీకే ఆరాధనా

 



Aradhana nike aradhana song lyrics :


ఆరాధనా నీకే ఆరాధనా

ఆరాధనా యేసు అన్ని వేళలా (2)

నా కష్టాలలో ఆరాధన

శోక సంద్రములో నీకే ఆరాధన

నా నష్టాలలో ఆరాధన

లోకమే నను విడచినా నీకే ఆరాధన      ||ఆరాధనా||


1.ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా

ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన

నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా

నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2)

యేసయ్యా నీకే నా ఆరాధన

యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)         ||ఆరాధనా||


2.రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా

సర్వమును భరించు యేసుకే ఆరాధన

శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా

లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2)

యేసయ్యా నీకే నా ఆరాధన

యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)         ||ఆరాధనా||










No comments:

Post a Comment