Premake Prathi Rupamu Song Lyrics :
ప్రేమకే ప్రతి రూపము నీవే నా ప్రాణము (2)
నీ ప్రేమే శాశ్వతం నీ మాటే అమృతం (2)
నా జీవితం నీకంకితం
నా ప్రియ యేసయ్య || ప్రేమకే ||
1.నే నడిచే దారిలో నా తోడువై
నే పీల్చేగాలిలో నా శ్వాసవై
నీ చేతి నీడలో నన్ను కాచావే
నీ గుండె లోతుల్లో నన్ను దాచావే (2)
నన్ను వీడని నా కన్న తండ్రివి
నన్ను మరువని నా కన్న తల్లివి
నిన్ను మరచిన నీ చేయి విడచినా
నన్ను విడువని యేసయ్య || ప్రేమకే ||
2.గురిలేని వేళలో నా గమ్యమై
దరిలేని దారిలో నా దీపమై
నా చింతలన్నియు నీవే తీర్చావే
నే కోరిన రేవుకు నన్ను చేర్చావే (2)
నన్ను కోరుకున్న నా పరమ తండ్రివి
నన్ను విడువనన్న నా మంచి కాపరి
నీవే నా గురి నాకున్న ఊపిరి
నీవే నా ప్రాణం యేసయ్య || ప్రేమకే ||


No comments:
Post a Comment